సోమవారం 13 జూలై 2020
National - Apr 08, 2020 , 17:06:13

యూపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం, 15 జిల్లాలు పూర్తిగా బంద్‌

యూపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం, 15 జిల్లాలు పూర్తిగా బంద్‌

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరిగిపోతుంటే అక్క‌డి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న జిల్లాల‌ను పూర్తిగా బంద్ చేసేవిధంగా చ‌ర్య‌లు చేప‌ట్టింది. లక్నో, అగ్ర, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా), కాన్పూర్, వారణాసి, షమ్లి, మీరట్, బరేలి, బులంద్ షేర్, ఫిరోజాబాద్, మహారాజ్ గంజ్, సీతాపూర్, షహరన్ పూర్, బస్తి వంటి జిల్లాలను ఈరోజు అర్ధరాత్రి నుంచి ఏప్రిల్ 13 వ తేదీ వరకు పూర్తిగా మూసేస్తున్నారు.  ఈ ఏరియాల్లోని ప్రజలకు నిత్యవసర వస్తువులను డోర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకోబోతున్నట్టు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్ర‌క‌టించారు.  యూపీలో ఇప్ప‌టి వ‌ర‌కు 343 కేసులు నమోదయ్యాయి.  ఇందులో 166 కేసులు మర్కజ్ తో లింక్ కావడంతో యోగి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.  


logo