బుధవారం 20 జనవరి 2021
National - Dec 04, 2020 , 10:19:35

ల‌వ్ జిహాద్ ఆర్డినెన్స్‌.. మ‌తాంత‌ర వివాహాన్ని అడ్డుకున్న యూపీ పోలీసులు

ల‌వ్ జిహాద్ ఆర్డినెన్స్‌.. మ‌తాంత‌ర వివాహాన్ని అడ్డుకున్న యూపీ పోలీసులు

ల‌క్నో: చ‌ట్ట విరుద్ధ మ‌త మార్పిడుల నిరోధ‌క ఆర్డినెన్స్‌ను కార‌ణంగా చూపుతూ యూపీ పోలీసులు ఓ మ‌తాంత‌ర వివాహాన్ని అడ్డుకున్నారు. ఓ హిందూ యువ‌తి.. ముస్లిం యువ‌కుడిని పెళ్లి చేసుకుంటోంద‌ని స‌మాచారం అందుకున్న ల‌క్నో పోలీసులు.. పెళ్లి వేదిక ద‌గ్గ‌ర‌కు వెళ్లి జ‌ర‌గ‌కుండా చూశారు. ఆ త‌ర్వాత వాళ్లిద్ద‌రినీ పోలీస్ స్టేష‌న్‌కు తీసుకెళ్లారు. కొత్త ఆర్డినెన్స్ ప్ర‌కారం.. మ‌తాంత‌ర వివాహం చేసుకునే ముందు ల‌క్నో జిల్లా మెజిస్ట్రేట్ అనుమ‌తి తీసుకోవాల‌ని పోలీసులు వాళ్ల‌కు సూచించారు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం జ‌రిగింది. స‌ద‌రు యువ‌తీయువ‌కుల‌కు ఆర్డినెన్స్‌కు సంబంధించిన కాపీల‌ను అంద‌జేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. అయితే రెండు కుటుంబాల స‌మ్మ‌తితోనే ఈ పెళ్లి జ‌రుగుతున్న‌ట్లు స‌ద‌రు యువ‌తీయువ‌కుల వ‌ర్గీయులు చెప్పారు. పెళ్లికి ముందు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ట్ట‌ప‌ర‌మైన లాంచ‌నాల‌ను పూర్తి చేస్తామ‌ని వాళ్లు తెలిపారు. ఇరు వ‌ర్గాల్లో ఎవ‌రికీ మ‌తం మారే ఉద్దేశం లేద‌ని కూడా వాళ్లు చెప్పారు. త‌ప్పుడు స‌మాచారంతో లేక‌ బ‌ల‌వంతంగా లేక‌ పెళ్లి కోస‌మే జ‌రిగే మ‌త మార్పిడులు నేరంగా ప‌రిగ‌ణిస్తామ‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ చ‌ట్ట‌విరుద్ధ మ‌త మార్పిడుల నిరోధక‌ ఆర్డినెన్స్ (2020) స్ప‌ష్టం చేస్తోంది. బ‌ల‌వంత‌పు మ‌త మార్పుడుల‌కు ఐదేళ్ల వ‌ర‌కు జైలు శిక్ష లేదా రూ.15000 జ‌రిమానా విధిస్తారు. 


logo