ఆదివారం 07 జూన్ 2020
National - Apr 02, 2020 , 11:05:01

యూపీ సీఎంపై కామెంట్స్‌.. సీనియ‌ర్ జ‌ర్నలిస్టుపై కేసు

యూపీ సీఎంపై కామెంట్స్‌.. సీనియ‌ర్ జ‌ర్నలిస్టుపై కేసు

అయోధ్య‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ట్విట్ట‌ర్ వేదిక‌గా ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్‌పై కామెంట్స్ చేసిన ఒక సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుపై ఆ రాష్ట్ర పోలీసులు కేసు న‌మోదు చేశారు. ముఖ్య‌మంత్రిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు జ‌ర్నిలిస్టుపై ఇండియ‌న్ పీన‌ల్ కోడ్‌లోని సెక్ష‌న్ 188, సెక్ష‌న్ 505 ప్ర‌కారం కేసులు న‌మోదు చేసిన‌ట్లు ఫ‌రీదాబాద్ కొత్వాలీ పోల‌స్‌స్టేష‌న్ ఎస్సై నితీశ్‌కుమార్ శ్రీవాస్త‌వ తెలిపారు. 

వివ‌రాల్లోకి వెళ్తే ఢిల్లీలోని మ‌ర్క‌జ్ నిజాముద్దీన్‌తో త‌బ్లీగి జ‌మాతే మ‌త ప్రార్థ‌న‌లు నిర్వ‌హించిన నాడే.. సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కూడా లాక్‌డౌన్‌ను లెక్క‌చేయ‌కుండా అయోధ్య‌లోని రామ‌జ‌న్మ‌భూమిలో మ‌త‌ప‌ర‌మైన స‌మావేశంలో పాల్గొన్నార‌ని, మార్చి 25 నుంచి ఏప్రిల్ 2 వ‌ర‌కు శ్రీరామ న‌వమి వేడుక‌లు నిర్వ‌హించాల‌ని ఆ స‌మావేశంలో నిర్ణ‌యించార‌ని, శ్రీరాముడే ప్ర‌జ‌ల‌ను క‌రోనా వైర‌స్ బారినుంచి కాపాడుతాడ‌ని కూడా ఆ స‌మావేశంలో పాల్గొన్న మ‌త‌పెద్ద‌లు వ్యాఖ్యానించార‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ సిద్ధార్థ్ వ‌ర‌ద‌రాజ‌న్ ట్విట్ట‌ర్ వేదిక‌గా కామెంట్స్ చేశారు. 

ఈ కామెంట్స్‌పై ఫ‌రీదాబాద్ పోలీస్‌స్టేష‌న్‌కు ఫిర్యాదు అంద‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేశారు. కాగా, త‌న‌పై కేసు న‌మోదు చేయ‌డాన్ని జ‌ర్నలిస్ట్ సిద్ధార్థ్ వ‌ర‌ద‌రాజ‌న్ త‌ప్పుప‌ట్టారు. నిజాలు మాట్లాడినా కేసులు పెట్ట‌డం అన్యాయ‌మ‌న్నారు. త‌నపై కేసు న‌మోదు వెనుక రాజ‌కీయ‌ప‌ర‌మైన కుట్ర దాగి ఉన్న‌ద‌ని ఆయ‌న ఆరోపించారు. 


   logo