ఆదివారం 05 జూలై 2020
National - Jun 27, 2020 , 15:15:14

టీచర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు యూపీ సర్కారు ఆదేశాలు!

టీచర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు యూపీ సర్కారు ఆదేశాలు!

లక్నో: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, కాలేజీలు, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ స్కూళ్లలోని టీచర్ల సర్టిఫికెట్లను క్షుణ్నంగా పరిశీలించాలని ఉత్తరప్రదేశ్‌ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీచేయాలంటూ రాష్ట్రంలోని అన్ని డిస్ట్రిక్ట్‌ మెజిస్ట్రేట్లకు ఆ రాష్ట్ర అడిషనల్‌ చీఫ్‌ సెక్రెటరీ మోనికా ఎస్‌ గార్గ్‌ ఉత్తరాలు రాశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అన్ని జిల్లాల్లో బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ఫేక్‌ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన టీచర్లను గుర్తించేందుకుగానూ బేసిక్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఇటీవల ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. 

 రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో ఫేక్‌ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తున్న అనామిక శుక్లా కేసుతో తేరుకున్న ఆ రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. అనామిక శుక్లా నకిలీ ధ్రువీకరణపత్రాలతో  25 విద్యాసంస్థల్లో పనిచేస్తూ ఏడాదిలో రూ. కోటి సంపాదించినట్లు తేలగా, ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైంది. logo