ఆదివారం 31 మే 2020
National - May 16, 2020 , 12:36:46

అధికారుల నిర్లక్ష్యమే కొంప ముంచింది: మాయావతి

అధికారుల నిర్లక్ష్యమే కొంప ముంచింది: మాయావతి

న్యూఢిల్లీ: ఉత్తప్రదేశ్‌లోని అరైయాలో జరిగిన ప్రమాద ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తీవ్రంగా స్పందించారు. అధికారులు నిర్లక్ష్యమే 24 మంది వలసకూలీల దుర్మరణానికి కారణమని ఆమె ఫైరయ్యారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. రాష్ట్రం నుంచి ఇతర రాష్ర్టాలకు వెళ్లలే కూలీలతోపాటు, ఇతర రాష్ర్టాల నుంచి రాష్ర్టానికి వచ్చే వలసకూలీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఘోరం ప్రమాదం జరిగిందని మాయావతి మండిపడ్డారు. ప్రమాదంలో మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియాతోపాటు, గాయపడిన వారికి ఆర్థిక సాయం అందించాలిన ఆమె డిమాండ్‌ చేశారు. అదేవిధంగా వలసకూలీలకు సైతం ఆమె ఒక సూచన చేశారు. స్వస్థలాలకు చేరాలనుకునే వలస కూలీలు కాలి నడకన, ట్రక్కుల్లో వెళ్లొద్దని, ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన శ్రామిక్‌ రైళ్లన వినియోగించుకోవాలని సూచించారు. 


logo