గురువారం 21 జనవరి 2021
National - Jan 09, 2021 , 18:41:55

యూపీ మంత్రికి పితృ వియోగం

యూపీ మంత్రికి పితృ వియోగం

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మంత్రి సురేష్ రాణాకు పితృవియోగం సంభవించింది. ఈ ఉద‌యం ఆయ‌న‌ తండ్రి ర‌ణ్‌బీర్‌సింగ్ రాణా (92) క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌ షామ్లీ జిల్లా తానాభ‌వ‌న్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని త‌న నివాసంలో తుదిశ్వాస విడిచారు. ర‌ణ్‌బీర్‌సింగ్ మృతిప‌ట్ల ప‌లువురు సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. యూపీ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్ కూడా సురేష్ రాణాకు ఫోన్‌చేసి ప‌రామ‌ర్శించారు. ర‌ణ్‌బీర్ మృతికి సంతాపం తెలిపారు.    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo