శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 11:39:31

మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రికి క‌రోనా

మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రికి క‌రోనా

న్యూఢిల్లీ: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ కేబినెట్‌లోని మ‌రో మంత్రికి క‌రోనా వైర‌స్ సోకింది. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి నంద్ గోపాల్ గుప్తాకు క‌రోనా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో ఆయ‌న వైద్యుల సూచ‌న‌తో హోం క్వారంటైన్‌లో ఉన్నాన‌ని తెలిపారు. 2010లో జ‌రిగిన ఆర్డీఎక్స్ దాడిలో గాయ‌ప‌డ‌టంతో జ‌రిగిన స‌ర్జ‌రీల వ‌ల్ల ప‌రిస్థితి కొంత క్లిష్టంగా మారింది. అయినా అంద‌రి దీవెన‌లు, ప్రార్థ‌న‌ల‌‌తో తొంద‌ర‌గానే కోలుకుంటాన‌ని ట్వీట్ చేశారు. కాగా, రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 16 మంది మంత్రులు క‌రోనా బారిన‌ప‌డ్డారు.