శనివారం 08 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 11:46:38

యూపీ మంత్రి క‌మ‌ల్ రాణి క‌రోనాతో మృతి

యూపీ మంత్రి క‌మ‌ల్ రాణి క‌రోనాతో మృతి

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సాంకేతిక విద్యాశాఖ మంత్రి క‌మ‌ల్ రాణి దేవి క‌రోనాతో మృతిచెందారు. గ‌త‌ కొంత‌కాలంగా క‌రోనా చికిత్స పొందుతున్న ‌కమ‌ల్ రాణి ఆదివారం ఉద‌యం 9.30 గంట‌ల‌కు క‌న్నుమూశారని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. జూలై 18న ఆమె క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో అప్ప‌టి నుంచి సంజ‌య్ గాంధీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈరోజు ఉద‌యం మ‌ర‌ణించారు. 

మంత్రి క‌మ‌ల్ రాణి మ‌ర‌ణం ప‌ట్ల సీఎం యోగీ ఆదిత్య నాథ్ తీవ్ర‌సంతాపం ప్ర‌క‌టించారు. ‌రాణి మ‌ర‌ణంతో రామ మందిర భూమి పూజ ఏర్పాట్ల‌పై స‌మీక్ష స‌మావేశాన్ని, అయోధ్య ప‌ర్య‌ట‌న‌ను సీఎం ర‌ద్దు చేసుకున్నారు.   

క‌మ‌ల్ రాణి కాన్పూర్‌లోని ఘ‌టంపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతిన‌థ్యం వ‌హిస్తున్నారు. 11, 12వ లోక్‌స‌భ‌ల్లో ఆమె స‌భ్యురాలిగా ఉన్నారు. 


logo