బుధవారం 03 మార్చి 2021
National - Jan 22, 2021 , 12:42:52

మంత్రి గులాబ్ దేవికి క‌రోనా పాజిటివ్‌

మంత్రి గులాబ్ దేవికి క‌రోనా పాజిటివ్‌

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ మంత్రి గులాబ్ దేవికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఆమే స్వ‌యంగా ఒక ప్ర‌క‌ట‌న ద్వారా మీడియాకు వెల్లడించారు. గ‌త రెండు రోజులుగా ద‌గ్గు వ‌స్తుండ‌టంతో లక్నోలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని, ఆ ప‌రీక్ష‌ల్లో త‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింద‌ని గులాబ్ దేవి తెలిపారు. అందువ‌ల్ల ఇటీవ‌ల త‌న‌తో స‌న్నిహితంగా మెలిగిన అధికారులు, పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని, ఎవ‌రికివారు సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని ఆమె సూచించారు. గులాబ్ దేవి చందౌసీ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై గెలిచి, ఆ రాష్ట్ర మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కించుకున్నారు.   ‌ 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo