గురువారం 16 జూలై 2020
National - Jun 14, 2020 , 17:04:00

వలస కార్మికుడ్ని దోచుకుని.. దారుణంగా హత్య

వలస కార్మికుడ్ని దోచుకుని.. దారుణంగా హత్య

ముజఫర్‌నగర్‌: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వలస కార్మికుడ్ని దోచుకోవడమేగాక దారుణంగా హత్య చేశారు. ముజఫర్‌నగర్‌లో నివసించే 22 ఏండ్ల అర్బాజ్ పని నిమిత్తం మధ్యప్రదేశ్‌కు వెళ్లి లాక్‌డౌన్‌ వల్ల అక్కడే ఉండిపోయాడు. స్నేహితుడు నౌమన్‌తో కలిసి సొంతూరుకు కాలినడకన ప్రయాణమయ్యాడు. శుక్రవారం రేవా జిల్లాలో ఓ ఆటో డ్రైవర్‌ను వారిద్దరు లిఫ్ట్‌ అడిగారు. వారిని ఎక్కించుకున్న ఆటో డ్రైవర్‌ కొంతదూరం తీసుకెళ్లి వారి వద్ద ఉన్నవి దోచుకున్నాడు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన అర్బాజ్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఇది చూసిన స్నేహితుడు నౌమన్‌ అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. logo