గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 16:04:16

టాయిలెట్‌లో మొస‌లి.. హ‌డ‌లెత్తిన ఇంటి య‌జ‌మాని

టాయిలెట్‌లో మొస‌లి.. హ‌డ‌లెత్తిన ఇంటి య‌జ‌మాని

ల‌క్నో: టాయిలెట్ రూమ్‌లో ఒక మొస‌లి క‌నిపించ‌డంతో ఆ ఇంటి య‌జ‌మాని హ‌డ‌లెత్తిపోయాడు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మొహబ్బత్‌పూర్ గ్రామానికి చెందిన ఒక వ్య‌క్తికి బుధ‌వారం ఉద‌యం త‌న ఇంటి బ‌య‌ట ఉన్న‌ మరుగుదొట్టిలో మొస‌లి క‌నిపించింది. ఐదు అడుగుల పొడ‌వు ఉన్న దానిని చూసిన అత‌డు భ‌యాందోళ‌న‌తో కేక‌లు వేశాడు. స‌హాయం కోసం స్థానికుల‌ను పిలిచాడు. వారంతా క‌లిసి ఆ టాయిలెట్ రూమ్ త‌లుపు మూసేశారు. అనంత‌రం అట‌వీశాఖ‌కు స‌మాచారం అందించారు. దీంతో న‌లుగురు సిబ్బంది వ‌చ్చి ఆ మొస‌లిని బోనులో బంధించారు. అనంత‌రం స‌మీపంలోని య‌మునా న‌దిలో దానిని విడిచిపెట్టారు.తాజావార్తలు


logo