మంగళవారం 14 జూలై 2020
National - Jun 27, 2020 , 01:34:42

యూపీ సర్కార్‌కి బెదిరేది లేదు: ప్రియాంక

యూపీ సర్కార్‌కి బెదిరేది లేదు:  ప్రియాంక

న్యూఢిల్లీ: యూపీ ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా ఎన్ని చర్యలు తీసుకున్నా భయపడనని, తాను ఇందిరాగాంధీ మనుమరాలినని కాంగ్రెస్‌ నేత ప్రియాంకగాంధీ అన్నారు. బీజేపీలోని కొంతమందిలాగా తాను అప్రకటిత అధికార ప్రతినిధిని కాదని శుక్రవారం ట్వీట్‌ చేశారు. నిజాలు మాట్లాడుతున్నందుకు యూపీ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతున్నదని ఆరోపించారు.  కాన్పూర్‌లోని ఓ వసతి గృహంలో 57 మంది బాలికలకు కరోనా సోకిందని ప్రియాంక ఆదివారం ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. అందులో ఇద్దరు గర్భవతులని, వారిలో ఒకరికి హెచ్‌ఐవీ ఉన్నదని తెలిపారు. దీనిపై రాష్ట్ర బాలల హక్కుల మండలి ప్రియాంకకు నోటీసులు జారీచేసింది. 


logo