చిరుద్యోగుల తీర్థయాత్రల కోసం ఒక్కొక్కరికి రూ.12 వేలు!

లక్నో: ప్రైవేటు సంస్థల్లో పనిచేసే కార్మికులు, చిరుద్యోగుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్వామి వివేకానంద ఇతిహాసిక్ పర్యటన్ యాత్రా యోజనను తీసుకొచ్చింది. ఈ నెల 24న యూపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పథకానికి సంబంధించిన ఎంపిక ప్రక్రియను ప్రారంభించనుంది. రాష్ట్ర కార్మిక సంక్షేమ మండలిలో నమోదు చేసుకున్న 1.5 కోట్ల మంది కార్మికులకు ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది. ఉత్తరప్రదేశ్ కార్మిక సంక్షేమ మండలి చైర్మన్ సునీల్ భరాలా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వ్యాపార సంస్థలు, ఫ్యాక్టరీలు, వర్క్ షాప్‌లలో పనిచేస్తున్న సిబ్బంది (కార్మికులు, చిరుద్యోగులు) కోసం ప్రభుత్వం ఈ నూతన పథకాన్ని తీసుకొచ్చిందని చెప్పారు.
ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రదేశాలకు వెళ్లడం కోసం కార్మికులు, చిరుద్యోగులకు ఒక్కొక్కరికి రూ.12,000 చొప్పున చెల్లించనున్నారు. అయోధ్య, మథుర, ప్రయాగ్‌రాజ్, వారణాసి, హస్తినాపూర్, గోరఖ్‌నాథ్, శాకంబరీ దేవి దేవాలయం, వింధ్యవాసినీ దేవి దేవాలయం, ఆగ్రా యూపీ ప్రభుత్వం ఎంపికచేసిన యాత్రా ప్రదేశాల్లో ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.