గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 12:01:57

సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే.. యూపీలో 10 వేలు జ‌రిమానా

సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే.. యూపీలో 10 వేలు జ‌రిమానా

హైద‌రాబాద్‌: సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారికి ప‌ది వేల రూపాయాలు జ‌రిమానా విధించేందుకు ఉత్త‌రప్ర‌‌దేశ్‌ స‌ర్కార్ సిద్ధ‌మైంది.  ఆ రాష్ట్రానికి చెందిన ర‌వాణా శాఖ దీనికి సంబంధించిన ఆదేశాల‌ను ఈనెల 30వ తేదీన జారీ చేసింది. జూన్ నెల‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం డ్రైవింగ్ నిబంధ‌న‌ల‌పై కొత్త చ‌ట్టాన్ని త‌యారు చేసింది. రోడ్డు భ‌ద్ర‌త అంశంలో యూపీ ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. అయితే ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవాళ్లు నాలుగు రేట్లు ప్ర‌మాదానికి గురయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో ఓ నివేదిక‌లో వెల్ల‌డించింది.   


logo