బుధవారం 20 జనవరి 2021
National - Dec 02, 2020 , 13:53:37

మ‌తాంత‌ర వివాహాల‌ను ప్రోత్స‌హించే స్కీమ్ ర‌ద్దు !

మ‌తాంత‌ర వివాహాల‌ను ప్రోత్స‌హించే స్కీమ్ ర‌ద్దు !

హైద‌రాబాద్‌:  కులాంత‌ర‌, మ‌తాంత‌ర వివాహాల‌ను ప్రోత్స‌హించే స్కీమ్ ఒక‌టి యూపీ రాష్ట్రంలో ఉన్న‌ది. 44 ఏళ్ల క్రితం నాటి ఆ స్కీమ్‌కు ఇప్పుడు యోగి స‌ర్కార్ స్వ‌స్తి  చెప్పాల‌నుకుంటున్నది.  ల‌వ్ జిహాద్ పేరుతో జ‌రుగుతున్న మ‌త‌మార్పుడుల‌ను అడ్డుకునేందుకు యూపీ స‌ర్కార్ కొత్త చ‌ట్టాన్ని తెస్తున్న విష‌యం తెలిసిందే. కానీ భిన్న విశ్వాసాల ప్ర‌జ‌ల మ‌ధ్య జ‌రిగే  వివాహ ప్ర‌క్రియ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు 1976లో ప్ర‌వేశపెట్టిన స్కీమ్‌ను ఇప్పుడు ర‌ద్దు చేయాల‌ని భావిస్తున్నారు.  ఈ స్కీమ్‌ను యూపీలోని నేష‌న‌ల్ ఇంటిగ్రేష‌న్ డిపార్ట్‌మెంట్ చూస్తున్న‌ది. యూపీ నుంచి విడువ‌డిన ఉత్త‌రాఖండ్ రాష్ట్రం కూడా ఈ స్కీమ్‌ను ర‌ద్దు చేయాల‌ని భావిస్తున్న‌ది. ఈ స్కీమ్ కింద‌.. మ‌తాంత‌ర వివాహం చేసుకున్న వారు.. పెళ్లి జ‌రిగిన రెండేళ్ల‌లోపు జిల్లా మెజిస్ట్రేట్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఆ ద‌ర‌ఖాస్తు ఆమోదం పొందిన దంప‌తుల‌కు 50వేల న‌గ‌దు ఇస్తారు.  గ‌త ఏడాది ఈ స్కీమ్ కింద 11 జంట‌లు ల‌బ్ధిపొందాయి. కానీ ఈ ఏడాది ఒక్క‌రికి కూడా అమౌంట్ రిలీజ్ చేయ‌లేదు. ఈ స్కీమ్ కోసం నాలుగు ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మ‌త‌మార్పుడుల‌కు పాల్ప‌డేవారికి ప‌దేళ్లు క‌ఠిన శిక్ష అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఇటీవ‌ల యోగి స‌ర్కార్ ఓ ఆర్డినెన్స్ జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఆ ఆర్డినెన్స్‌కు గ‌వ‌ర్న‌ర్ క్లియ‌రెన్స్ కూడా ద‌క్కింది.  


logo