శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 18, 2020 , 12:51:10

పరీక్షలు నిర్వహించకుండానే పాస్‌ చేస్తాం..

పరీక్షలు నిర్వహించకుండానే పాస్‌ చేస్తాం..

లక్నో : కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే పాస్‌ చేస్తామని ఆ రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ వెల్లడించింది. విద్యార్థులందరినీ ఎలాంటి ఆటంకం లేకుండా పైతరగతులకు ప్రమోట్‌ చేస్తామని స్పష్టం చేసింది. యూపీలో ప్రైమరీ పాఠశాలలకు మార్చి 23 నుంచి 28 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆ పరీక్షలను రద్దు చేశారు. ఇక మిగతా తరగతుల విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. ఏప్రిల్‌ 2 వరకు విద్యాసంస్థలకు యూపీ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. 


logo