గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 15, 2020 , 02:14:00

ఖఫీల్‌ఖాన్‌పై ఎన్‌ఎస్‌ఏ ప్రయోగం

ఖఫీల్‌ఖాన్‌పై ఎన్‌ఎస్‌ఏ ప్రయోగం

లక్నో: కొద్దికాలం కిందట ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ వద్ద జరిగిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసన కార్యక్రమంలో రెచ్చగొట్టే ప్రసంగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్‌ ఖఫీల్‌ఖాన్‌పై పోలీసులు కఠినమైన జాతీయ భద్రతా చట్టాన్ని (ఎన్‌ఎస్‌ఏ) ప్రయోగించారు. ఆయన ప్రసంగం మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నదని పేర్కొంటూ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి జైలుకుపంపారు. ఈ కేసులో ఆయన శుక్రవారం బెయిల్‌పై విడుదల కావాల్సి ఉండగా.. ఇదే సమయంలో పోలీసులు ఎన్‌ఎస్‌ఏను ప్రయోగించారు. 


logo