శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Feb 23, 2021 , 18:51:26

పెళ్లిరోజునే రక్తదానం చేసిన వధూవరులు

పెళ్లిరోజునే రక్తదానం చేసిన వధూవరులు

లక్నో: నవ దంపతులు రక్తదానం చేసి ప్రాణ దాతలు అయ్యారు. ఓ యువతి ప్రాణాలు కాపాడటానికి  కొత్తగా వివాహం చేసుకున్న జంట పెళ్లి రోజునే రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచింది. ఆపదలో ఉన్న యువతి కోసం రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న వధూవరులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నూతన జంట రక్తదానం చేసిన విషయాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీస్‌ ఆశీష్‌ మిశ్రా ట్విటర్లో పంచుకున్నారు. ఈ జంటను ప్రశంసిస్తూ మిశ్రా నవదంపతుల ఫొటోను షేర్‌ చేశారు. 

ఈ ఫొటోలో వరుడు రక్తం దానం చేస్తుండగా అతని భార్య అతని పక్కన నిలబడి ఉంది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.  ఓ యువతి ప్రాణాపాయస్థితిలో ఉండగా ఆమెకు రక్తదానం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం తెలియగానే కొత్త దంపతులు పెళ్లి దుస్తుల్లోనే ఆస్పత్రికి వచ్చి సహాయం చేశారు. 

VIDEOS

logo