గురువారం 02 జూలై 2020
National - Jul 01, 2020 , 14:19:08

ఫిర్యాదు చేసేందుకు వ‌చ్చిన మ‌హిళ ముందు పోలీస్ ఏం పని చేశాడో తెలుసా..?

ఫిర్యాదు చేసేందుకు వ‌చ్చిన మ‌హిళ ముందు పోలీస్ ఏం పని చేశాడో తెలుసా..?

ల‌క్నో: న‌్యాయం కోసం పోలీస్‌స్టేష‌న్‌కు వ‌చ్చిన ఒక‌ మ‌హిళ ముందు పోలీస్ అధికారి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. కేసు గురించి మాట్లాడాల్సింది పోయి లైంగిక వాంఛ‌తో వెకిలి చేష్ట‌లు చేశాడు. అయితే పోలీస్ అధికారి అస‌భ్య కార్యాన్ని స‌దరు మ‌హిళ వీడియో తీసి పై అధికారుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్న‌తాధికారులు అత‌డిపై కేసులు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. విధుల నుంచి కూడా స‌స్పెండ్ చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం డియోరియా జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. 

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం డియోరియా జిల్లాకు చెందిన ఓ మ‌హిళ భూ త‌గాదా విష‌య‌మై భ‌ట్ని పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. అయితే, మ‌హిళ నుంచి ఫిర్యాదు తీసుకున్న స్టేష‌న్ ఆఫీస‌ర్ భీష్మ్‌పాల్ సింగ్ దానికి ఎలాంటి ప‌రిష్కారం చూప‌కుండా పెండింగ్‌లో పెట్టాడు. పైగా మ‌హిళను మ‌ళ్లీమ‌ళ్లీ స్టేష‌న్‌కు పిలిపిస్తూ ఆమె ముందు హ‌స్త‌ప్ర‌యోగం చేసేవాడు. అయితే రెండు సార్లు చూసి ఊరుకున్న మ‌హిళ‌.. మూడోసారికి త‌న ఫోన్‌లో వీడియో తీసి ఉన్న‌తాధికారులకు ఫిర్యాదు చేసింది. 

ఆమె ఫిర్యాదు మేర‌కు పోలీసులు స‌ద‌రు పోలీస్ అధికారిపై చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ విష‌యంపై మాట్లాడిన బాధితురాలు.. త‌న ఫిర్యాదును ఉద్దేశ‌పూర్వ‌కంగా పెండింగ్‌లో పెట్టి స‌ద‌రు పోలీస్ వెక‌లి వేశాలు వేశాడ‌ని మండిప‌డ్డారు. త‌ర‌చూ స్టేష‌న్‌కు రప్పించి త‌న ముందే హ‌స్త‌ప్ర‌యోగం చేసుకుంటుండటంతో భ‌రించ‌లేక వీడియో తీసి ఫిర్యాదు చేశానని చెప్పారు. పోలీసుల ప్ర‌వ‌ర్త‌న ఇలా ఉంటే ప్ర‌జ‌ల‌కు న్యాయం ఎలా జ‌రుగుతుంద‌ని ఆమె ప్ర‌శ్నించారు.  


logo