గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 13:19:43

కాలుతున్న‌ సిలిండ‌ర్‌ను తెలివిగా ఆర్పేసిన పోలీస్ : వీడియో వైర‌ల్‌

కాలుతున్న‌ సిలిండ‌ర్‌ను తెలివిగా ఆర్పేసిన పోలీస్ :  వీడియో వైర‌ల్‌

పోలీసులు చేసే పనులు చాలా తెలివిగా చేస్తారు. ఎప్పుడు ఎలా చేస్తే ఆ స‌మ‌స్య తీరుతుందో స‌రిగ్గా అలానే చేస్తారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఒక పూజారి ఇంట్లో సిలిండ‌ర్ అగ్నిప్ర‌మాదానికి గురైంది. కాసేపు అయి ఉంటే సిలిండ‌ర్ కాస్త పేలి భారీ విద్వంసాన్నే సృష్టించేది. యోగేంద్ర ర‌తి అనే పోలీస్ త‌న లాటీ క‌ర్ర‌తో చెక్క మీదున్న సిలిండ‌ర్‌ను కింద‌కి దించారు. ఆ త‌ర్వాత ఒక బ‌కెట్‌లో నీరు తీసుకొని క్లాత్‌ను ముంచి మండుతున్న సిలిండ‌ర్‌పైన క‌ప్పారు. అంతే దెబ్బ‌తో మంట‌లు ఆరిపోయాయి.

సంఘ‌ట‌న చిన్న‌దే అయినా జ‌ర‌గ‌బోయే ప్ర‌మాదం మాత్రం పెద్ద‌దే. త‌న ప్రాణాల‌ను ఏ మాత్రం లెక్క‌చేయ‌కుండా తెలివిగా ఆ పూజారి ఇంటిని కాపాడారు యోగేంద్ర ర‌తి. దీనికి సంబంధించిన వీడియోను మ‌రొక పోలీస్ రాహుల్ శ్రీ‌వాస్త‌వ ట్విట‌ర్ ద్వారా యోగేంద్ర‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఈ వీడియోకు నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. ఇలాంటి పోలీసులు రాష్ట్రానికి ఒక‌రున్నా చాలంటున్నారు. 


logo