సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 18:28:41

అధికారం ఉంద‌నే పొగ‌రుతో వ్య‌క్తిని న‌దిలో ప‌డేసిన పోలీస్ : వీడియో వైర‌ల్‌

అధికారం ఉంద‌నే పొగ‌రుతో వ్య‌క్తిని న‌దిలో ప‌డేసిన పోలీస్ :  వీడియో వైర‌ల్‌

ఎవరైనా త‌ప్పు చేస్తే ఎదిరించే అధికారం ఒక్క పోలీస్‌కు మాత్ర‌మే ఉంటుంది. అలాంటిది ఆ పోలీసే త‌ప్పు చేస్తే ఇక ఎవ‌రికి చెప్పుకుంటారు. కార‌ణం లేకుండా పోలీస్ ఓ వ్య‌క్తిని న‌దిలో ప‌డేసిన దృశ్యం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. ఇంత‌కీ ఆ పోలీస్ ఏం చేశాడో తెలిస్తే మీరు కూడా త‌ప్పుప‌డుతారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ మిర్జాపూర్ జిల్లాలోని వింద్యాచ‌ల్ ప్రాంతంలో ఓ వ్య‌క్తి గంగాన‌దిలో ప‌డి చ‌నిపోయాడు. అత‌న్ని బ‌య‌ట‌కు తీసేందుకు పోలీసులు ప్రావీణ్యం పొందిన‌ ఈత‌గాళ్ల‌ను పిలిపించి శ‌వాన్ని క‌నుగొన్నారు. ఈ సంఘ‌ట‌న చూసేందుకు గ్రామాల చుట్టుప‌క్కల వాళ్లంతా గుమిగూడారు.

క్రౌడ్ ఎక్కువ‌గా ఉండ‌డంతో పోలీసులు వారిని అక్క‌డి నుంచి పంపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఒక పోలీస్ మాత్రం పొగ‌రుతో న‌ది ఒడ్డున నిల్చుని ఉన్న ఒక వ్య‌క్తి కాలును త‌న్న‌డంతో ప‌ట్టుత‌ప్పి న‌దిలో ప‌డిపోయాడు. అదృష్ట‌వ‌శాత్తు నది ప్ర‌వాహం లేదు కాబ‌ట్టి స‌రిపోయింది. లేదంటే అత‌ని ప్రాణాలు గాల్లో క‌లిసిపోయేవి. వైర‌ల్ అవుతున్న ఈ సంఘ‌ట‌న‌న‌ను చూసి నెటిజ‌న్లు ఆ పోలీస్‌పై యాక్ష‌న్ తీసుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. logo