మంగళవారం 26 మే 2020
National - May 18, 2020 , 15:05:27

వలస కూలీలపై రాజకీయాలు వద్దు: యూపీ సీఎం యోగి

వలస కూలీలపై రాజకీయాలు వద్దు: యూపీ సీఎం యోగి

లక్నో: వలస కార్మికుల తరలింపు అంశంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై రాజకీయాలు చేయడం తగదని ట్విట్టర్‌లో ఎదురుదాడికి దిగారు. కరోనా కల్లోల కాలంలో కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలు అందరూ గర్హించాలి అని ఆయన పేర్కొన్నారు. ఔరాయా ప్రమాదానికి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని ఆయన పరోక్షంగా విమర్శించారు. వలస కార్మికుల మరణానికి కారణమైన ఒక ట్రక్కు పంజాబ్ నుంచి, మరొక ట్రక్కు రాజస్థాన్ నుంచి వచ్చిందని ఆయన తెలిపారు. ఆ రెండు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కావడం గమనార్హం. ఏదైనా సంస్థగానీ, పార్టీగానీ వలస కార్మికులను పంపించాలని దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇస్తామని యోగి స్పష్టం చేశారు. 500 బస్సుల్లో కూలీలను తరలిస్తుంటే యూపీ సర్కారు సరిహద్దుల్లో ఆపేసిందని రాజస్థాన్ పర్యాటక మంత్రి విశ్వేంద్ర సింగ్ ఆరోపించిన మరుసటి రోజే సీఎం యోగి ఈ ఎదురుదాడికి దిగడం గమనార్హం.


logo