గురువారం 28 మే 2020
National - May 10, 2020 , 18:07:00

మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌మాద‌ మృతుల కుటుంబాలకు రూ.2 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా

మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌మాద‌ మృతుల కుటుంబాలకు రూ.2 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా

లక్నో: మధ్యప్రదేశ్ రాష్ట్రం నర్సింగ్‌పూర్ ఏరియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. నర్సింగ్‌పూర్ జిల్లా కలెక్టర్ దీపక్ సక్సేనా తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ‌లోని హైద‌రాబాద్ న‌గ‌రం నుంచి ఉత్త‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రాకు మామిడిపండ్ల లోడుతో వెళ్తున్న లారీలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన 18 మంది కూలీలు ఎక్కారు. లాక్‌డౌన్ కార‌ణంగా హైద‌రాబాద్‌లో చిక్కుకున్న వారంతా స్వ‌గ్రామాల‌కు వెళ్లేందుకు లారీలో ఎక్కిన‌ట్లు తెలిసింది. అయితే వారు ప్రయాణిస్తున్న లారీ శనివారం రాత్రి మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌ సమీపంలో పథ గ్రామం ద‌గ్గ‌ర‌ బోల్తాపడింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు కూలీలు మరణించారు, మ‌రో 11 మంది గాయపడ్డారు. ఈ ప్ర‌మాదంలో మృతిచెందిన వారి కుటుంబాల‌కు యూపీ స‌ర్కారు న‌ష్ట‌ప‌రిహారం ప్ర‌క‌టించింది. logo