శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 09:07:31

భూమిపూజ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించ‌నున్న సీఎం‌

భూమిపూజ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించ‌నున్న సీఎం‌

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్ ఈరోజు అయోధ్య‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. రామ‌జ‌న్మ‌భూమిలో ఆగ‌స్టు 5న జ‌ర‌గ‌నున్న‌ రాముని గుడి భూమి పూజ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోదీ పాల్గొంటున్నారు. ఈ నేప‌థ్యంలో రామాల‌య నిర్మాణ భూమిపూజ ఏర్పాట్ల‌ను సీఎం ప‌రిశీలిస్తారు.

వ‌చ్చేనెల జ‌ర‌గ‌నున్న భూమి పూజ‌లో ప్ర‌ధాని మోదీ పాల్గొంటార‌ని ఆల‌య ట్ర‌స్ట్ అధ్య‌క్షుడు మ‌హంత్ నృత్య‌గోపాల్‌దాస్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ప్ర‌ధానితోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, కేంద్ర మంత్రులు, ఆర్ఎస్ఎస్ అధ్య‌క్షుడు మోహ‌న్ భ‌గ‌వ‌త్ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటార‌ని రామ‌జ‌న్మ‌భూమి క్షేత్ర ట్ర‌స్టు వెల్ల‌డించింది. 

ఆల‌య నిర్మాణ ప్ర‌దేశంలో ఉన్న రామ్‌‌ల‌ల్లా విగ్ర‌హాన్ని మాన‌స్ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆల‌యంలో గ‌త మార్చి నెల‌లో త‌ర‌లించారు. రామాలయ నిర్మాణం పూర్త‌య్యేవ‌ర‌కు రామ్‌ల‌ల్లా విగ్ర‌హాన్ని అక్క‌డే ఉంచ‌నున్నారు. 


logo