బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 21, 2020 , 09:56:15

35 లక్షల మంది కూలీలకు రోజుకు వెయ్యి..

35 లక్షల మంది కూలీలకు రోజుకు వెయ్యి..

లక్నో : కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అవసరముంటేనే బయటకు రావాలని ప్రభుత్వాలు ప్రజలను ఆదేశించాయి. దీంతో ప్రతి ఒక్కరూ నివాసాలకే పరిమితం అవుతున్నారు. అన్ని పనులు వాయిదా వేడయంతో.. దినసరి కూలీల పరిస్థితి ధీనంగా మారింది. రెక్కాడితే గానీ డొక్కాడని రోజువారి కూలీలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆఫర్‌ ప్రకటించారు. యూపీలోని 15 లక్షల మంది రోజువారి కూలీలతో పాటు భవన నిర్మాణ రంగంలో పని చేసే 20.37 లక్షల మంది కార్మికులకు రోజుకు రూ. వెయ్యి చొప్పున ఇస్తామని యోగి స్పష్టం చేశారు. ఈ డబ్బు.. కూలీల నిత్యవసర సరుకులకు, పనులకు ఉపయోగపడుతుందని యూపీ సీఎం పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటి వరకు 23 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 9 మంది కోలుకున్నారు. ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. logo
>>>>>>