గురువారం 09 జూలై 2020
National - Jun 19, 2020 , 17:20:11

చెరుకు రైతుల‌కు రూ.ల‌క్ష కోట్లు చెల్లించాం: ‌యూపీ సీఎం

చెరుకు రైతుల‌కు రూ.ల‌క్ష కోట్లు చెల్లించాం: ‌యూపీ సీఎం

ల‌క్నో: త‌మ ప్ర‌భుత్వం చెరుకు రైతుల సంక్షేమానికి క‌ట్టుబడి ఉందని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చెప్పారు. గ‌త మూడేండ్ల‌లో రాష్ట్రంలోని చెరకు రైతులకు రికార్డు స్థాయిలో చెల్లింపులు  జరిపినట్లు ఆయ‌న తెలిపారు. 2017 నుంచి 2020 మధ్య కాలంలో యూపీలోని 47.20 లక్షల మంది చెరకు రైతుల నుంచి కొనుగోలు చేసిన చెరుకు పంట‌కు రూ.1,00,000 కోట్లకు పైగా చెల్లించినట్లు ఆదిత్య‌నాథ్ వెల్ల‌డించారు.

రాష్ట్రంలో అధికారం చెలాయించిన గ‌త ప్రభుత్వం చెరుకు రైతులకు చేసిన‌ చెల్లింపుల కంటే త‌మ చెల్లింపులు దాదాపు రెండింతలు ఉన్నాయ‌ని యూపీ సీఎం చెప్పారు. 2014-17 మధ్య కాలంలో ప్ర‌భుత్వం రూ.53,367 కోట్ల విలువైన చెరుకు పంట‌ను కొనుగోలు చేస్తే.. 2017-2020 మధ్య కాలంలో త‌మ ప్ర‌భుత్వం రూ.1,00,000 కోట్ల విలువైన చెరుకు పంట‌ను రైతుల నుంచి కొనుగోలు చేసింద‌ని ఆయ‌న తెలిపారు. గ‌త ప్ర‌భుత్వ మూడేండ్ల చెల్లింపుల కంటే, త‌మ ప్ర‌భుత్వ మూడేండ్ల చెల్లింపులు రూ.46,633 కోట్లు అధికమ‌ని యోగి పేర్కొన్నారు. 


logo