శనివారం 04 జూలై 2020
National - Jun 14, 2020 , 18:31:51

ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల తనిఖీకి ప్రత్యేక బృందాలు

 ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల తనిఖీకి ప్రత్యేక బృందాలు

లక్నో: ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల తనిఖీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధికారులకు ఆదేశించారు. అనామిక శుక్లా అనే ఉపాధ్యాయురాలు పలు ప్రభుత్వ స్కూళ్లలో పని చేస్తున్నట్లు మోసగించి కోటి రూపాయలకుపైగా వేతనం పొందుతున్న విషయం ఇటీవల బయటపడింది. ఈ ఘటన ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆదివారం తన నివాసంలో సీనియర్‌ అధికారులతో ఓ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్ల ఒరిజినల్‌ సర్టిఫికెట్ల తనిఖీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని వారికి సూచించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యోగి ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు. 
logo