గురువారం 28 మే 2020
National - May 14, 2020 , 10:45:53

మధ్యప్రదేశ్‌ రోడ్డు ప్రమాద మృతులకు 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

మధ్యప్రదేశ్‌ రోడ్డు ప్రమాద మృతులకు 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

లక్నో : ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులు.. మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. వలస కూలీలందరూ ట్రక్కులో వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్‌లోని గునాలో రాత్రి చోటు చేసుకుంది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 


logo