శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 09:14:44

భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేయండి : యూపీ సీఎం

భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేయండి : యూపీ సీఎం

ల‌క్నో : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేయాల‌ని ఆ రాష్ర్ట‌ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ఆదేశించారు. యూపీ సీఎం యోగి బుధ‌వారం ఆ రాష్ర్ట ఉన్న‌తాధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఆగ‌స్టు 5వ తేదీన అయోధ్య‌లో రామ‌జ‌న్మ‌భూమికి శంకుస్థాప‌న సంద‌ర్భంగా ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. బ‌క్రీద్, ర‌క్షాబంధ‌న్, జ‌న్మాష్ట‌మి, స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లకు బందోబ‌స్తు ఏర్పాటు చేయాల‌న్నారు. సంఘ విద్రోహ శ‌క్తులు ఈ వేడుక‌ల‌కు ఆటంకం కలిగించే అవ‌కాశం ఉన్నందున‌.. పోలీసు విభాగం నిఘా పెట్టాల‌న్నారు. కొవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటించి వేడుక‌ల‌ను నిర్వ‌హించుకోవాల‌ని సీఎం సూచించారు. 

కొవిడ్ నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా డోర్ టూ డోర్ స‌ర్వే నిర్వ‌హించి టెస్టులు చేయాల‌న్నారు. కంటైన్మెంట్ జోన్ల‌లో ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్‌, సివిల్ డిఫెన్స్ వారి స‌హాకారం తీసుకోని ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. 

ఇక శ్రీరాముడి ఆల‌య నిర్మాణ‌ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు లాల్ కృష్ణా అద్వానీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ హాజ‌రు కానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ వేడుక‌ను వీక్షించేందుకు శ్రీరాముడి భ‌క్తులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. రామాల‌యం నిర్మాణం 2023 నాటికి పూర్తి కానుంది.


logo