గురువారం 28 మే 2020
National - May 17, 2020 , 10:59:06

వలస కార్మికుల కోసం ప్రత్యేక బస్సులు

వలస కార్మికుల కోసం ప్రత్యేక బస్సులు

లక్నో: వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్సులను నడుపుతున్నది ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం. లాక్‌డౌన్‌తో సొంతూర్లకు వెళ్తున్న వలస కార్మికులు రవాణా సదుపాయాలు లేకపోవడంతో కాలినడకన కొందరు, సైకిళ్లతో, లారీపై వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఔరయలో నిన్న రెండు ట్రక్కులు ఢీకొని 25 మంది వలస కార్మికులు మరణించారు. దీంతో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ రాష్ట్రంలో ఏ ఒక్క వలస కార్మికుడు కూడా కాలినడకన, సైకిళ్లు, అనుమతి లేని వాహనాలపై ప్రయాణాలు చేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రహదారుల వెంట వెళ్తున్న వలస కార్మికులను బస్సుల్లో ఎక్కించుకుని, వారు వెళ్లాల్సిన ప్రాంతాల్లో దించేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బస్సు డైవర్లు, కండక్టర్లకు మార్గదర్శకాలు జారీచేశామని యూపీఎస్‌ఆర్టీసీ ఎండీ రాజ్‌ శేఖర్‌ వెల్లడించారు.


logo