శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 27, 2020 , 17:42:08

నకిలీ కరోనా సర్టిఫికెట్‌ సమర్పించిన బీజేపీ ఎమ్మెల్యేపై కేసు

నకిలీ కరోనా సర్టిఫికెట్‌ సమర్పించిన బీజేపీ ఎమ్మెల్యేపై కేసు

లక్నో: కోర్టుకు హాజరు నుంచి తప్పించుకునేందుకు నకిలీ కరోనా పాజిటివ్‌ సర్టిఫికెట్‌ సమర్పించిన ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. మెన్‌దావాల్ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ బాగెల్‌కు వ్యతిరేకంగా 2010లో నమోదైన హత్యాయత్నం, ప్రజా ఆస్తికి నష్టం  కేసులో కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నది. అయితే దీని నుంచి తప్పించుకునేందుకు తనకు కరోనా పాజిటివ్‌ అని నకిలీ సర్టిఫికెట్‌ను ఆయన సృష్టించారు. సంత్ కబీర్ నగర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్‌ హర్‌గోవింద్‌ సింగ్‌ దానిని కోర్టులో ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యే రాకేశ్‌ సింగ్‌ హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు.

అయితే ఎమ్మెల్యే తన ఇంట్లో లేరని, ఫోన్‌లో అందుబాటులోకి రాలేదని హామ్‌ ఐసొలేషన్‌ను తనిఖీ చేసే బృందానికి చెందిన డాక్టర్‌ వివేక్‌ కుమార్‌ శ్రీవాస్తవ కోర్టుకు చెప్పారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే బాగెల్, డాక్టర్ హర్‌గోవింద్‌ సింగ్‌పై కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ, మోసం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo