గురువారం 03 డిసెంబర్ 2020
National - Oct 30, 2020 , 11:39:42

మాస్కే వ్యాక్సిన్ : ఢిల్లీ ఆరోగ్య మంత్రి

మాస్కే వ్యాక్సిన్ : ఢిల్లీ ఆరోగ్య మంత్రి

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఒక్క‌సారిగా మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కేసులు పెరిగాయి. దీంతో మూడ‌వ ద‌ఫా వైర‌స్ కేసుల విజృంభ‌ణ మొద‌లైందా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.  దేశ రాజ‌ధాని ఢిల్లీలో నిన్న ఒక్క రోజే 5673 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ క్ర‌మంలో 35 శాతం బెడ్లు కొవిడ్ రోగుల‌తో నిండిపోయాయి. వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు మాస్కులు ధ‌రించాల‌ని, ప్ర‌తి ఒక్క‌రూ మాస్కును వ్యాక్సిన్‌గా ప‌రిగ‌ణించాల‌ని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ సూచించారు. మాస్కు ధ‌రిస్తే అటు వైర‌స్ నుంచి, ఇటు కాలుష్యం నుంచి ర‌క్ష‌ణ పొందొచ్చ‌ని తెలిపారు. ఇటీవ‌ల కాంటాక్ట్స్ ఎక్కువ కావ‌డం వ‌ల్లే మ‌ళ్లీ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయ‌ని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు.