e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News రెండో పెళ్లి చేసుకున్న మ‌హిళ‌.. ఉమ్మిని నాకాల‌ని ఆదేశం

రెండో పెళ్లి చేసుకున్న మ‌హిళ‌.. ఉమ్మిని నాకాల‌ని ఆదేశం

రెండో పెళ్లి చేసుకున్న మ‌హిళ‌.. ఉమ్మిని నాకాల‌ని ఆదేశం

ముంబై : రెండో పెళ్లి చేసుకున్న మ‌హిళ‌కు కుల పెద్ద‌లు దారుణ శిక్ష విధించారు. కుల పెద్ద‌ల ఉమ్మిని నాకాల‌ని ఆదేశించారు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌హారాష్ర్ట అకోలా జిల్లాలో వెలుగు చూసింది. అకోలా జిల్లాకు చెందిన ఓ మ‌హిళ‌(35)కు 2011లో వివాహ‌మైంది. కుటుంబ గొడ‌వ‌ల కార‌ణంగా త‌న భ‌ర్త‌కు 2015లో విడాకులు ఇచ్చింది. ఆ త‌ర్వాత 2019లో ఆమె రెండో వివాహం చేసుకుంది. కానీ ఈ వివాహాన్ని ఆమె కులమైన నాథ్ జోగి క‌మ్యూనిటీ పెద్ద‌ల‌కు న‌చ్చ‌లేదు.

దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 9న ఆమె సోద‌రితో పాటు బంధువుల‌ను కుల పెద్ద‌లు పిలిపించారు. రెండో పెళ్లి చేసుకున్నందుకు శిక్ష విధిస్తున్న‌ట్లు తెలిపారు. అదేంటంటే.. కుల పెద్ద‌లంతా క‌లిసి అర‌టి ఆకుల‌పై ఉమ్మి వేస్తార‌ని, దాన్ని స‌ద‌రు మ‌హిళ నాకాల‌ని ఆదేశించారు. అంతే కాకుండా రూ. ల‌క్ష జ‌రిమానా వేశారు. ఈ శిక్ష‌పై తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన బాధిత మ‌హిళ‌.. నిన్న పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రెండో పెళ్లి చేసుకున్న మ‌హిళ‌.. ఉమ్మిని నాకాల‌ని ఆదేశం

ట్రెండింగ్‌

Advertisement