మంగళవారం 24 నవంబర్ 2020
National - Oct 27, 2020 , 16:29:40

న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు అన్‌లాక్ 5 మార్గ‌ద‌ర్శ‌కాలే..

న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు అన్‌లాక్ 5 మార్గ‌ద‌ర్శ‌కాలే..

హైద‌రాబాద్‌:  కోవిడ్ నేప‌థ్యంలో అన్‌లాక్ 5 నిబంధ‌న‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం పొడిగించింది. ఆ మార్గ‌ద‌ర్శ‌కాలే న‌వంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు వ‌ర్తిస్తాయ‌ని ఇవాళ కేంద్ర హోంశాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.  సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్‌, స్పోర్ట్స్ ట్రైనింగ్ కేంద్రాల‌ను ష‌ర‌తుల‌తో ఓపెన్ చేసేందుకు సెప్టెంబ‌ర్ 30వ తేదీన కేంద్రం అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఆ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను న‌వంబ‌ర్ చివ‌రినాటి వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ఇవాళ కేంద్రం హోంశాఖ స్ప‌ష్టం చేసింది.

కంటేన్మెంట్ జోన్ల‌లో మాత్రం లాక్‌డౌన్‌ను క‌ఠినంగా అమ‌లు చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. రెండు రాష్ట్రాల మ‌ధ్య రాక‌పోక‌ల విష‌యంలో ఎటువంటి నిబంధ‌న‌లు లేవ‌ని చెప్పింది.  ఆ రాక‌పోక‌ల‌కు ఎటువంటి ప‌ర్మిష‌న్‌-అనుమ‌తి అవ‌స‌రం లేదు. సినిమా థియేట‌ర్ల‌లో 50 శాతం ఆక్యుపెన్సీకి అనుమ‌తి ఇస్తూ సెప్టెంబ‌ర్ 30వ తేదీన కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే కొన్ని రాష్ట్రాలు ఇప్ప‌టికే సినిమాహాళ్ల‌ను తెరిచాయి. ఇంకా కొన్ని రాష్ట్రాలు మ‌త్రం థియేట‌ర్ల‌ను తెర‌వ‌లేదు.  ప్ర‌స్తుతం అక్టోబ‌ర్ నిబంధ‌న‌ల‌నే పొడిగించ‌డం వ‌ల్ల థియేట‌ర్ల యాజ‌మాన్యం ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..