బుధవారం 08 జూలై 2020
National - Jun 28, 2020 , 18:54:52

దేశ రాజధానిలో అన్‌లాక్‌ 2.0 మార్గదర్శకాలు

దేశ రాజధానిలో అన్‌లాక్‌ 2.0 మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇకపై మాల్స్‌కు వెళ్లి షాపింగ్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు అన్‌లాక్ 2.0 మార్గదర్శకాలు విడుదలయ్యాయి. గురుగ్రామ్,  ఫరీదాబాద్లలో షాపింగ్ మాల్స్ తెరవడానికి అనుమతి లభించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మూడు నెలలపాటు మూసివేసిన షాపింగ్ మాల్స్ మరో రెండురోజుల్లో మరోసారి సందడి చేయనున్నాయి. 

జూలై 1 వ తేదీ నుంచి ఎన్‌సీఆర్‌, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లలో షాపింగ్ మాల్స్ తెరుచుకోనున్నాయి. దీనికి పట్టణ స్థానిక సంస్థ SOP జారీ చేసింది. మాల్‌లోకి ప్రవేశించడానికి కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు రూపొందించారు. కరోనా మహమ్మారి ఇన్ఫెక్షన్ నుంచి మనుగడ సాగించే విధంగా ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం ఈ నియమాలను రూపొందించింది. ఈ నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, లేనిపక్షంలో జరిమానా వేయనున్నట్టు నిబంధనల్లో స్పష్టం చేశారు. జిల్లా డిప్యూటీ కమిషనర్ ఏర్పాటుచేసిన కమిటీ సభ్యులు మాల్స్‌ లోపల ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చు. మాల్ లోపల ఎవరైనా మాస్క్‌ లేకుండా కనిపిస్తే వారికి చలాన్‌ విధిస్తారు. షాపింగ్ మాల్స్, మాల్స్ యజమానులు సమయ పట్టికను పరిగణలోకి తీసుకోనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మాల్స్‌ లో పాటించాల్సిన నియమాలు

- ప్రజలు భౌతిక దూరం నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి.

- ముఖానికి మాస్క్‌ లేకుండా మాల్ లోపలకు అనుమతించకూడదు.

- సెక్యూరిటీ గార్డులు షాపింగ్ మాల్స్, మాల్స్ లోపలికి వెళ్ళే గేట్ వద్ద ప్రజలను థర్మల్ స్క్రీనింగ్ చేపట్టాలి.

- మాల్స్ నుంచి బయటికి వెళ్లే సమయాల్లో కూడా థర్మల్ స్క్రీనింగ్ చేయవలసి ఉంటుంది.

- ఎవరికైనా శరీర ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నట్లయితే సమీప ఆరోగ్య కేంద్రానికి సమాచారం ఇవ్వాలి.


logo