బుధవారం 08 జూలై 2020
National - Jul 01, 2020 , 10:45:48

నేటినుంచి అన్‌లాక్‌ 2.0

నేటినుంచి అన్‌లాక్‌ 2.0

ఢిల్లీ : దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో నేటి నుంచి అన్‌లాక్‌ 2.0 ప్రారంభమవుతుంది. దీనికిగాను భారత ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసింది. ఈ రెండో దశ అన్‌లాక్‌ జూలై 1 నుంచి 31 వరకు నడువనున్నట్లు ప్రధాని తెలిపారు. దేశంలో సుమారు నాలుగు నెలల పాటు లాక్‌డౌన్‌ విధించగా ఆ తరువాత దశల వారీగా సడలింపులు ఇస్తూ వస్తున్నారు. జాన్‌ 1 నుంచి అన్‌లాక్‌ 1.0 ప్రారంభమవగా ఇప్పుడు నేటి నుంచి 2.0 ప్రారంభమైంది. 

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నేటి నుంచి విమానాలు, రైళ్ల సంఖ్య పెరుగనుంది. ఇప్పటివరకు వాటి సేవలను పరిమిత సంఖ్యలో ఉంచారు. ఇప్పుడు ఈ సంఖ్యను రెట్టింపు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు రాత్రి కర్ఫ్యూ ఉంటుంది. అంతకుముందు ఈ సమయం 9 నుంచి 5 గంటల వరకు ఉండేది. సుమారు 55 మందికి పైగా వ్యక్తులు దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో ఉండవచ్చు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ ఉండాలి. జులై 15 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శిక్షణ సంస్థల్లో పనులు ప్రారంభమవుతాయి. జులై 31 వరకు  పాఠశాలలు, కళాశాలలు, మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, వ్యాయామశాలలు, ఈత కొలనులు, ఎంటర్టైన్మెంట్ పార్కులు, థియేటర్లు, ఆడిటోరియంలు మూసివేయబడే ఉంటాయి.

ఇదే కాకుండా కంటైన్మెంట్‌ ప్రదేశాల్లో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇక్కడ అవసరమైన కార్యకలాపాలు మాత్రమే నిర్వహించేలా కేంద్రం కఠిన నిబంధనలు జారీ చేసింది. అంతే కాకుండా కంటైన్మెంట్‌ ప్రదేశాల్లో కరోనా పరీక్షల సంఖ్య కూడా పెంచాలని ప్రభుత్వాలను ఆదేశించింది. అన్‌లాక్‌ 1.0లో ప్రార్ధనా మందిరాలు, ఆలయాలు తెరిచిన విషయం తెలిసిందే. అక్కడ కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.  

అన్‌లాక్ చేయడంతో ప్రజలు నిర్లక్ష్యంగా మారారని, అయితే ఈ నిర్లక్ష్యాన్ని విస్మరించరాదని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం తన ప్రసంగంలో అన్నారు. ప్రజలు నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. 


logo