గురువారం 09 జూలై 2020
National - Jan 30, 2020 , 17:06:29

జైలుకెళ్లకుంటే నాయకుడు కాలేరు..

జైలుకెళ్లకుంటే నాయకుడు కాలేరు..

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఎవరైనా జైలుకు వెళ్లకపోతే రాజకీయ నాయకుడు కాలేరని దిలీప్‌ఘోష్‌ వ్యాఖ్యానించారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలను ప్రతిఘటించాలంటే పార్టీ కార్యకర్తలు చురుకుగా ఉండాలని పేర్కొంటూ..దిలీప్‌ ఘోష్‌ పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. ఇంటి దగ్గరే ఉంటే మంచి రాజకీయ నాయకుడు కాలేదు. కేవలం ఇంటి దగ్గరే కూర్చొని మంచి రాజకీయవేత్త అవుదామనుకోకండి. మీరంతా  చురుకుగా పనిచేయాలి. అప్పుడు మిమ్మల్ని పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేస్తారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల బెదిరింపులకు లొంగవద్దని దిలీప్‌ఘోష్‌ బీజేపీ కార్యకర్తలకు సూచించారు. 


logo