గ్లోబల్‌స్టార్ ప్రియాంకచోప్రా తన భర్త నిక్‌జోనస్‌ను పొగడ్తల్లో ముంచెత్తింది. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా వృత్తిపట్ల అంకితభావం ప్రదర్శించే గొప్ప వ్యక్తి అని కొనియాడింది. ఇటీవల ఈ జంట బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్‌లో వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి కొద్దిరోజుల ముందు నిక్‌జోనస్ బైక్ ప్రమాదంలో గాయపడ్డారు. పక్కటెముక ఫ్రాక్చర్ అయినప్పటికీ ముందస్తు ఒప్పందం ప్రకారం అవార్డు వేడుకకు హాజరయ్యారు. దీంతో భర్తలోని నిబద్ధతను మెచ్చుకుంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేసింది ప్రియాంకచోప్రా. ‘పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నా సరే నా భర్త ధైర్యాన్ని ప్రదర్శిస్తాడు. వృత్తిపట్ల అంకితభావం, పనిలో పర్ఫెక్షన్ కనబరచాలనే తపనే ఆయన్ని ముందుకు నడిపిస్తోంది. ప్రతి రోజు నేను నా భర్తనే స్ఫూర్తిగా తీసుకుంటా’ అని పేర్కొంది ప్రియాంకచోప్రా. ఈ సందర్భంగా భర్తతో కలిసి తీయించుకున్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది ప్రియాంకచోప్రా.