శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 17, 2021 , 14:31:05

రైతుల్లో చాలామంది వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు అనుకూల‌మే: కేంద్రం

రైతుల్లో చాలామంది వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు అనుకూల‌మే: కేంద్రం

న్యూఢిల్లీ: రైతుల డిమాండ్‌ల‌లో తాము నెర‌వేర్చ‌ద‌గిన వాటికి సంబంధించి రైతు సంఘాల‌కు త‌మ‌ ప్ర‌తిపాద‌నలు పంపించామ‌ని కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ ‌మంత్రి న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్ చెప్పారు. ఆ ప్రతిపాద‌న‌ల‌లో మండీలు, ట్రేడ‌ర్స్ రిజిస్ట్రేష‌న్‌లు స‌హా ఇత‌ర అంశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. అదేవిధంగా స్ట‌బుల్ బ‌ర్నింగ్‌, విద్యుత్‌కు సంబంధించిన చ‌ట్టాల‌పై కూడా చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం అంగీకారం తెలిపింద‌ని మంత్రి తోమ‌ర్ వెల్ల‌డించారు.

వ్య‌వ‌సాయ నిపుణుల‌తోపాటు రైతుల్లో కూడా చాలామంది తాజా వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు అనుకూలంగా ఉన్నార‌ని మంత్రి తోమర్ తెలిపారు. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల త‌ర్వాత ఆ చ‌ట్టాల‌ను అమ‌లుచేయ‌కుండా అయ్యింద‌ని చెప్పారు. జ‌న‌వ‌రి 19న రైతులు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై క్లాజ్‌ల వారీగా చ‌ర్చిస్తార‌ని భావిస్తున్నామన్నారు. ప్ర‌భుత్వం అంశాల‌వారీగా చ‌ర్చ‌ల‌కు సిద్ధంగా ఉన్న‌ప్ప‌టికీ రైతు సంఘాల నాయ‌కులు మాత్రం చ‌ట్టాల‌ను పూర్తిగా వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేయ‌డం క‌రెక్టు కాద‌న్నారు.            

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo