శనివారం 11 జూలై 2020
National - May 25, 2020 , 12:19:40

గ‌దిలో బంధించి బెల్టు‌తో కొట్ట‌డమూ తెలుసు.. కేంద్ర మంత్రి వ్యాఖ్య‌లు

గ‌దిలో బంధించి బెల్టు‌తో కొట్ట‌డమూ తెలుసు.. కేంద్ర మంత్రి వ్యాఖ్య‌లు

హైద‌రాబాద్‌: కేంద్ర గిరిజ‌న‌శాఖ స‌హాయ మంత్రి రేణుకా సింగ్‌.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.  చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని బ‌ల‌రాంపూర్‌లో ఉన్న క్వారెంటైన్ సెంట‌ర్‌ను విజిట్ చేసిన ఆమె.. అక్క‌డ ఉన్న అధికారుల‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.  దాదాగిరి న‌డ‌వ‌దంటూనే.. పిచ్చి పిచ్చి వేషాలు వేసేవారిని ఎలా ట్రీట్ చేయాలో తెలుస‌న్నారు.  రూముల్లోకి తీసుకువెళ్లి, బెల్టుతో కొట్ట‌డం త‌న‌కూ తెలుసు అని ఆమె ఆవేశంగా అన్నారు. బ‌ల‌రాంపూర్ క్వారెంటైన్ సెంట‌ర్‌లో ఉన్న దిలీప్ గుప్తా .. సెంట‌ర్‌లో వ‌స‌త‌లు స‌రిగా లేవ‌ని ఓ వీడియో పోస్టు చేశారు. అయితే సోష‌ల్ మీడియాలో వీడియోను అప్‌లోడ్ చేసేందుకు త‌న‌పై అధికారులు దాడి చేసిన‌ట్లు అత‌ను ఆరోపించాడు. ఈ నేప‌థ్యంలో కేంద్ర మంత్రి రేణుకా సింగ్ ఆ సెంట‌ర్‌ను విజిట్ చేశారు. త‌మ ప్ర‌భుత్వం అధికారంలో లేద‌ని ఎవ‌రూ భావించ‌వ‌ద్దు అని, 15 ఏళ్లు తాము పాలించామ‌ని, క‌రోనా వైర‌స్‌తో పోరాడేందుకు కేంద్రం వ‌ద్ద కావాల్సిన‌న్ని నిధులు ఉన్నాయ‌ని, బీజేపీ కార్య‌క‌ర్త‌లు బ‌ల‌హీనుల‌ని భావించ‌రాదు అని కేంద్ర‌మంత్రి రేణుకా అక్క‌డున్న అధికారుల‌కు వార్నింగ్ ఇచ్చారు. చీక‌టి రూమ్‌లోకి తీసుకువెళ్లి బెల్ట్‌తో కొట్ట‌డం త‌న‌కు కూడా తెలుస‌న్నారు. ప్ర‌స్తుతం చ‌త్తీస్‌ఘ‌డ్‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఉన్న‌ది.  


logo