శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Sep 17, 2020 , 11:11:58

కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ సింగ్‌కు క‌రోనా

కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ సింగ్‌కు క‌రోనా

న్యూఢిల్లీ: పార్ల‌మెంట్ స‌మావేశాలు కొన‌సాగుతున్న వేళ క‌రోనా బారిన ప‌డుతున్న‌ కేంద్ర మంత్రుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ది. నిన్న కేంద్ర ర‌వాణా శాఖ‌ మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి క‌రోనా సోక‌గా, తాజాగా కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ సింగ్ ప‌టేల్‌కు క‌రోనా నిర్ధార‌ణ అయ్యింది. ఈమేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. 

తాను నిన్న క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని, ఫ‌లితాల్లో పాజిటివ్‌గా వ‌చ్చింద‌ని ప్ర‌క‌టించారు. ఈ మ‌ధ్య‌కాలంలో త‌నను క‌లిసిన‌వారు త‌గిన‌ జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని, క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. 

ఇప్ప‌టికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు సుమారు ఏడుగురు కేంద్ర మంత్రులు, 20 మందికి పైగా మంది పార్ల‌మెంటు సభ్యులు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు క‌రోనాతో దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం చనిపోయిన విష‌యం తెలిసిందే.logo