శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 22, 2021 , 15:18:39

రైతు సంఘాల‌తో 11వ సారి కేంద్రం చ‌ర్చ‌లు

రైతు సంఘాల‌తో 11వ సారి కేంద్రం చ‌ర్చ‌లు

న్యూఢిల్లీ: కొత్త సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ రైతులు ఆందోళ‌న‌లు చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ విష‌యంపై రైతు సంఘాలు 11వ సారి కేంద్ర ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు నిర్వ‌హించారు. ఇవాళ ఢిల్లీలోని విజ్ఞాన్‌భ‌వ‌న్‌లో ఈ చ‌ర్చ‌లు జ‌రిగాయి.  ఏడాదిన్న‌ర పాటు సాగు చ‌ట్టాల అమ‌లుపై స్టే విధించేందుకు కేంద్రం ఆస‌క్తి చూపిన విష‌యం తెలిసిందే.  ఈ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం జాయింట్ క‌మిటీని ఏర్పాటు చేసేందుకు కూడా కేంద్రం సిద్ధ‌మైంది.  ఈ నేప‌థ్యంలో 11వ సారి రైతు సంఘాల‌తో చ‌ర్చలు జ‌రిగాయి. కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ థోమ‌ర్‌, రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌, వాణిజ్య‌శాఖ స‌హాయ‌మంత్రి సోమ్ ప్ర‌కాశ్‌లు 41 రైతు సంఘాల నాయ‌కుల‌తో చ‌ర్చిస్తున్నారు.  

VIDEOS

logo