శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Aug 03, 2020 , 14:31:26

హోం ఐసోలేషన్‌లో కేంద్ర మంత్రులు!

హోం ఐసోలేషన్‌లో కేంద్ర మంత్రులు!

న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం విదితమే. ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్‌ మీటింగ్‌లో అమిత్‌ షా పాల్గొన్నారు. దీంతో ఆ సమావేశానికి హాజరైన కేంద్ర కేబినెట్‌ మంత్రులంతా హోం ఐసోలేషన్‌లో ఉండాలని కేంద్రం సూచించింది. కేంద్రం సూచనలతో కేబినెట్‌ మంత్రులు, అధికారులు సోమవారం అన్ని సమావేశాలను రద్దు చేసుకున్నారు. మంత్రులు, అధికారులు ఇంటికే పరిమితమయ్యారు. అయితే ప్రధానితో పాటు మంత్రులు కూడా కేబినెట్‌ మీటింగ్‌కు హాజరవడంతో.. అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.

కరోనా సోకిన అమిత్‌ షా గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అమిత్‌ షా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.