శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 05, 2020 , 13:05:44

కొవిడ్‌19 దవాఖానను సందర్శించిన కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్

కొవిడ్‌19 దవాఖానను సందర్శించిన కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్

ఢిల్లీ : ఢిల్లీలో కొవిడ్‌ రోగుల కోసం డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిర్మించిన సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వెయ్యి పడకల దవాఖానను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌, డీఆర్‌డీఓ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి స్వాగతం పలికారు. 

అనంతరం మంత్రులు దవాఖాన మొత్తం కలియదిరిగి సౌకర్యాలను పరిశీలించారు. ఎన్ని పడకలు, వార్డులు, ఐసీయూలు ఎన్ని ఉన్నాయో డీఆర్‌డీఓ అధికారులను అడిగి తెలుసుకున్నారు.  అయితే ఈ దవాఖానలోని వార్డులకు లడఖ్‌ ఘర్షణలో ప్రాణాలు విడిచిన భారత సైనికుల పేర్లు పెట్టాలని నిశ్చయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా దవాఖానలోని ఐసీయూ, వెంటిలేటర్‌ వార్డుకు కర్నల్‌ సంతోశ్‌బాబు పేరు పెట్టారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo