బుధవారం 27 జనవరి 2021
National - Jan 11, 2021 , 22:09:34

కేంద్ర‌మంత్రి శ్రీ‌పాద్ నాయ‌క్‌కు రోడ్డు ప్ర‌మాదం.. భార్య దుర్మ‌ర‌ణం

కేంద్ర‌మంత్రి శ్రీ‌పాద్ నాయ‌క్‌కు రోడ్డు ప్ర‌మాదం.. భార్య దుర్మ‌ర‌ణం

అంకోలా (క‌ర్ణాట‌క‌):  కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయ‌క్‌కు సోమ‌వారం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో తీవ్ర గాయాల‌య్యాయి. క‌ర్ణాట‌క‌లోని ఉత్త‌ర క‌న్న‌డ జిల్లాలో ఎల్లాపుర నుంచి గోక‌ర్ణ‌కు వెళుతుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  

అంకోలా తాలూకా హోసాకంబీ గ్రామం వ‌ద్ద వారు ప్ర‌యాణిస్తున్న కారు బోల్తా ప‌డింది. కేంద్ర మంత్రి శ్రీ‌పాద్‌ నాయ‌క్‌, ఆయ‌న భార్య విజ‌య‌, వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి దీప‌క్ దూబే, మ‌రొక‌రు తీవ్రంగా గాయ ప‌డ్డారు. 

విజ‌య త‌ల‌కు తీవ్ర గాయ‌మైంది. కాగా, వారిని చికిత్స కోసం స‌మీప ప్ర‌భుత్వ‌  ద‌వాఖాన‌కు త‌ర‌లించ‌గా ఆయ‌న భార్య విజ‌య‌‌, వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి దీప‌క్ మ‌ర‌ణించార‌ని పోలీసులు ధ్రువీక‌రించారు. 

తీవ్రంగా గాయ‌ప‌డిన‌ కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయ‌క్‌కు ప్రాథ‌మిక చికిత్స త‌ర్వాత మెరుగైన వైద్య సేవ‌ల కోసం గోవాకు త‌ర‌లించారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని తెలుస్తున్న‌ది. 

కాగా,  ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ.. గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్‌తో మాట్లాడారు. నాయ‌క్ చికిత్స కోసం త‌గు ఏర్పాట్లు జేయాల‌ని ఆదేశించారు. ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ప్ర‌మాదం ప‌ట్ల విచారం వ్య‌క్తం చేశారు. శ్రీ‌పాద్ నాయ‌క్ త్వ‌రిత‌గ‌తిన కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. అవ‌స‌ర‌మైతే శ్రీ‌పాద్ నాయ‌క్‌ను త‌రలించ‌డానికి ప్ర‌త్యేక ఎయిర్ అంబులెన్స్ ను అందుబాటులోకి తెస్తామ‌ని చెప్పారు. 

శ్రీ‌పాద్ నాయక్‌, త‌న భార్య పిల్ల‌ల‌తో క‌లిసి యెల్లాపూర్‌లోని గంటే గ‌ణ‌ప‌తి దేవాల‌యాన్ని శుక్ర‌వారం ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. తిరిగి గోక‌ర్ణ‌కు రాత్రి ఏడు గంట‌ల‌కు బ‌య‌లుదేరారు. 

మార్గ‌మ‌ధ్యలో ఎన్‌హెచ్‌-63 నుంచి స‌బ్ రోడ్డు.. గోక‌ర్ణ‌కు అడ్డ‌దారికి వారు ప్ర‌యాణిస్తున్న ఎస్‌యూవీ కారును మ‌ళ్లించారు. ఈరోడ్డు ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. దీంతో కారు అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. మంత్రి భార్య విజ‌య‌, వ్య‌క్తిగ‌త కార్యద‌ర్శి దీప‌క్ దూబే, మ‌రొక వ్య‌క్తి గాయ‌ప‌డ్డారు. అంకోలా పోలీసులు కేసు న‌మోదు చేశారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo