శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
National - Aug 03, 2020 , 14:13:30

స్వీయ ఐసొలేషన్‌లో కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌

స్వీయ ఐసొలేషన్‌లో కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్వీయ ఐసొలేషన్‌లో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను శనివారం కలిసిన నేపపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమిత్‌ షాకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా ఆదివారం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో తనను కలిసిన వారంతా హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో అమిత్‌ షాను కలిసిన పలువురు ఐసొలేషన్‌లో ఉంటున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో తాను కూడా స్వీయ ఐసొలేషన్‌ విధించుకున్నట్లు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. మరోవైపు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని రవిశంకర్‌ ప్రసాద్‌ కార్యాలయం సోమవారం తెలిపింది. 


logo