మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Aug 31, 2020 , 15:11:09

ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద భారీ భ‌ద్ర‌త ఏర్పాటు చేయండి: కేంద్ర మంత్రి

ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద భారీ భ‌ద్ర‌త ఏర్పాటు చేయండి: కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రేపటి నుంచి జ‌ర‌గ‌నున్న జేఈఈ మెయిన్ ప్ర‌వేశ‌ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద భారీ భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేయాల‌ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ కోరారు. ఈ మేర‌కు ఆయ‌న గోవా ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్‌ను ట్వీట్ చేశారు. ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ ప‌రీక్ష‌ల‌ను వాయిదావేయాల‌ని కోరుతున్న నేప‌థ్యంలో జేఈఈ, నీట్ ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద గ‌ట్టి భ‌ద్ర‌తతోపాటు, త‌గిన సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని సీఎంకు విజ్ఞ‌ప్తి చేశారు. 

రాష్ట్రంలో జేఈఈ, నీట్ ప‌రీక్ష‌ల కోసం 17 కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. మొత్తం 6939 మంది ప‌రీక్ష‌లు రాయ‌నున్నారు. క‌రోనా స‌మ‌యంలో ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ నిరాహార దీక్ష చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యార్థి నేత‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు.