శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Aug 04, 2020 , 21:21:28

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా పాజిటివ్‌

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. సామాన్య ప్రజలే కాదు.. ముఖ్యమంంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు వైర‌స్‌ బారినపడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కరోనా బారిపడగా ఇవాళ ఆ జాబితాలో  కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేశారు.

తాను స్వల్పంగా అనారోగ్యం బారినపడ్డానని, కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. డాక్టర్ సలహా ప్రకారం ఆసుపత్రిలో చేరానని, ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఆదివారం కరోనా బారినపడగా సోమవారం ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు ఇవాళ తెలంగాణలోని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనా బారినపడి మృతి చెందిన సంగతి తెలిసింది. 


తాజావార్తలు


logo