శనివారం 05 డిసెంబర్ 2020
National - Aug 18, 2020 , 20:35:51

దేశంలో ఎరువుల కొరత లేదు :కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియ

దేశంలో ఎరువుల కొరత లేదు :కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియ

ఢిల్లీ : కేంద్ర రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవియ మంగళవారం రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో పాటు, ఎరువులు, వ్యవసాయ మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులతో ఆన్ లైన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాండవియా మాట్లాడుతూ దేశంలో ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు.  ఇవి రైతు సమాజానికి అవసరమైన పరిమాణంలో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా ఎరువులు సజావుగా సరఫరా చేయడానికి రాష్ట్ర పరిపాలన అధికారులందరితో సమన్వయంతో పనిచేయాలని మంత్రిత్వ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పలు రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎరువుల శాఖ కార్యదర్శి ఛబిలేంద్ర రౌల్,  సంయుక్త కార్యదర్శితో పాటు ఆ శాఖ లోని ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.