మంగళవారం 09 మార్చి 2021
National - Nov 26, 2020 , 16:29:46

అధికారుల‌తో కేంద్ర విద్యామంత్రి ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష‌

అధికారుల‌తో కేంద్ర విద్యామంత్రి ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష‌

న్యూఢిల్లీ: ‌కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ నిశాంక్ గురువారం త‌న మంత్రిత్వ శాఖ‌కు చెందిన అధికారుల‌తో ఉన్న‌త‌స్థాయి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. విద్యాశాఖకు సంబంధించిన వివిధ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌పై ఈ స‌మీక్షా సమావేశంలో చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్.. స్కాల‌ర్‌షిప్‌ల‌కు సంబంధించి యూజీసీకి కీల‌క సూచ‌న చేశారు. ఈ విద్యాసంవ‌త్స‌రానికి సంబంధించి అన్ని ర‌కాల స్కాల‌ర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు సకాలంలో పంపిణీ జ‌రిగేలా చూడాల‌ని ఆదేశించారు. అందుకోసం ఓ హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. ‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo